calender_icon.png 18 March, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య రంగానికి 20% బడ్జెట్ కేటాయించాలి..

17-03-2025 05:39:03 PM

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్య రంగానికి 20% బడ్జెట్ కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. ఈ మేరకు సోమవారం లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ విద్య రంగంలో దేశంలో చివరి స్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ప్రాముఖ్యతను గుర్తించాలని, ఈ బడ్జెట్ లో విద్యకు అధిక నిధులు కేటాయించవలసిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల మూసివేతను తక్షణమే నిలిపివేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల సమస్యలను పరిష్క రించి, మౌలిక సౌరకార్యాలు కల్పించాలన్నారు. విద్యారంగాన్ని బలోపితం చేసి, ఖాళీగా ఉన్న టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ ల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో 90% పైగా ఉన్న అట్టడుగువర్గాలు అభివృద్ధి పథంలో  పయనించాలంటే విద్యకు అధిక నిధులు కేటాయించి పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రేయింబర్సుమెంట్ కూడా వెంటనే చెల్లించాలన్నారు. అలాగే రాష్ట్ర విద్య కమిషన్ రిపోర్ట్ ను వెంటనే అమలు చేయాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు.