calender_icon.png 31 October, 2024 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయించాలి

31-10-2024 12:00:00 AM

ముషీరాబాద్, అక్టోబర్ 30: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్ని రంగాల్లో సమాన వాటా దక్కాలని బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్ అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. సమసమాజ రాజ్యస్థాపన లక్ష్యంగా బ్లూ ఇండియా పార్టీ స్థాపించాలమని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్  కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారానికి దూరంగా నెట్టివేయబడ్డ అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్మెట భూపాల్, ఉపాధ్యక్షుడు అమీనోద్దీన్, జాతీయ సమన్వయకర్తలు బానోతు లింగన్న, కొక్కిన శ్రీలత గౌడ్‌తో పాటు రావణ్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.