calender_icon.png 1 March, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల కడుపు కొట్టి.. పెద్దల కడుపు నింపుతోంది

01-03-2025 12:54:31 AM

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్ 

ఇల్లెందు (విజయక్రాంతి): కేంద్రం ప్రెవేశ పెట్టిన బడ్జెట్ కార్మిక, కర్షక, పేదలను పూర్తిగా విస్మరించ్చారని, పేదల కడుపు కొట్టి, కార్పొరేట్ ల కడుపు నింపుతున్నారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్ ఆరోపించారు. ఇల్లందు సీఐటీయూ కార్యాలయం లో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పై జరిగిన సదస్సు లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బీజేపీ దృష్టిలో దేశమంటే అంబాని, అదానీలే తప్ప, సామాన్య ప్రజలు కాదని, కేంద్ర ప్రభుత్వం తరఫున ఎనిమిదవ సారి పార్లమెంట్ లో పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేదిగా ఉన్నదని, కష్టజీవులకు ఏమాత్రం ఉపయోగ పడనిదిగా ఉన్నదన్నారు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురుజాడ సూక్తిని ఉటంకిస్తూ మాట్లాడారని, కానీ సమాజ సంపదలో సృష్టికర్తలుగా ఉన్న కార్మికులు, వ్యవసాయ కూలీల, రైతాంగానికి ఊరట ఇచ్చే విధం గా కానీ, కొత్త పథకాలు ప్రకటన కానీ, వారి కొనుగోలు శక్తి పెంచే నిర్ణయాలు కానీ ఈ బడ్జెట్ లో లేవన్నారు. భారత దేశంలో నూతన ఆర్థిక విధానాల అమలు ప్రారంభమైన 1991 నుండి వచ్చిన వరస బడ్జెట్‌లను పరిశీలిస్తే కార్పొరేట్‌లకు ఊడిగం చేస్తూ, సామాన్యు లపైన,  మధ్య తరగతి వర్గాలపైన భారాలను మోపే బడ్జెట్‌లను తీసుకువచ్చారన్నారు. రైతు సంఘం నాయ కులు అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, ఈసం వెంకటమ్మ, సుల్తాన, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి బయ్యా అభిమన్యూ, మన్నెం మోహనరావు, మరియా, చింత రాంబాయి, ఆలేటి సంధ్య, సర్వన్ కుమార్, వజ్జ సురేష్, నాగరాజు, సత్యనారాయణ కోరి, భద్రు ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు.