calender_icon.png 11 March, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్ సమావేశాలను విజయవంతం చేయాలి

11-03-2025 12:00:00 AM

  1. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి 
  2. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందించాలి 
  3. మూడంచెల భద్రతను కల్పించాలి
  4. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజా వుగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచించారు.

శాసనసభా సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానుండటంతో సోమవారం స్పీకర్ చాంబర్‌లో  నిర్వహించిన సమావేశానికి మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్,  అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బా బు, సీఎస్ శాంతికుమారి, అసెంబ్లీ కార్యదర్శి నరింహాచార్యులు, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ర్ట శాసనసభ సమావేశాల హుందాతనాన్ని పెంపొందించే విధంగా ఏర్పాట్లు ఉం డాలన్నారు. బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయని, అందుకు  రాష్ర్ట ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు.

సభ్యులు అడిగిన సమాచారా న్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, సభలో  సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని స్పీకర్ సూ చించారు. సభ లోపలితో పాటుగా, పరిసరాల్లో కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే చర్చలు బాగా జరుగుతాయని, సభ జరుగుతున్న సమయంలో ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమా చారం అందుకుని అడ్డుకోవాలని సూచించారు.

ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా, చురుకుగా పనిచేయాలన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట శాసన సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు.  సమావేశాలు జరిగే రోజుల్లో అసెంబ్లీ, శాసన మండలి చు ట్టూ మూడు అంచెల భద్రతను కట్టుదిట్టం చేయాలని, అలాగే అసెంబ్లీకి వచ్చే రూట్‌లో కూడా భద్రతను ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి శ్రీధర్‌బాబు 

సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు జవాబులను త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతీ శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమిస్తామని,  తద్వారా అనుసంధానానికి సులభమవుతుందన్నారు.