10-03-2025 01:01:25 AM
ఎన్నో సవాళ్ల మధ్య 2025 బడ్జెట్
నిరాశాజనకంగా రాష్ట్ర రాబడి
వచ్చే ఏడాది పెరగనున్న సర్కార్ వ్యయం
ఆర్‌ఆర్‌ఆర్, మూసీ, మెట్రో2 పనులకు భారీగా నిధులు అవసరం
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు కూడా..
2024 పద్దు రూ.2.91 లక్షల కోట్లు
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): పెద్దఎత్తున భుజానికెత్తుకున్న అభివృద్ధి పనులు.. ఎన్నికల హామీల మేర కు సంక్షేమ పథకాల అమలు.. రాబడి మాత్రం అంతంతమాత్రం.. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలు ముగిసినా వచ్చిన రాబడి 55.9 శాతం మాత్రమే. ఇలా ‘ఏ నెలకు ఆ నెల.. ఈ నెల గడిస్తే చాలు’ అన్నట్లు సర్కార్ నెట్టుకువస్తున్నది.
ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొం టున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల్లో పైసా విది ల్చడం లేదు. మరోవైపు కొత్తగా మరిన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు చేపట్టాలని సర్కార్ యోచిస్తున్నది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇస్తామని సర్కార్ ప్రకటించింది.
ఇలాంటి తరుణంలో 2025 26 బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఆసన్నమైంది. సర్కార్ గతేడాది బడ్జెట్ రూ.2.91 లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టింది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పద్దు రూ.3 లక్షల కోట్లు దాటుతుందా..? అనే చర్చ తెరమీదకు వచ్చింది.
ఆచితూచి బడ్జెట్‌పై కసరత్తు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం చేసిన అప్పులకు.. ప్రస్తుత ప్రభుత్వం వడ్డీలకు కడుతున్నది. ఒకవైపు ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చేస్తూనే, మరోవైపు పెద్దఎత్తున అభి వృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే సర్కార్ ఆర్‌ఆర్‌ఆర్, గ్రామాల్లో రహదారులు, మెట్రో రైల్ 2 ఫేజ్, మూసీ పునరుజ్జీవం, రెసిడెన్సియల్ పాఠశాలల నిర్మాణం, ఫోర్త్ సిటీ.. ఇలా ఎన్నోన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులను సైతం భుజానికి ఎత్తుకున్నది. ఇవేకాక 2025 మరికొన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమైంది.
ఇలాంటి తరుణంలో పెండింగ్ బిల్లుల సమస్య ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు కొన్ని బిల్లుల చొప్పున విడుదల చేస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటిం చారు. అది వాస్తవ రూపంలోకి రావాలంటే సర్కార్‌కు మరిన్ని నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర బడ్జెట్ కూడా గతే డాది కంటే 10 15 శాతం వరకు పెరగాల్సి ఉంటుంది. అదే జరిగితే పద్దు రూ.3 లక్షల కోట్ల మార్కు దాటి తీరుతుంది.
ప్రస్తుతం ప్రభుత్వ రాబడి అంతగా లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలు ముగిసినప్పటికీ రాబడి 55.96శాతం ఆదాయం మాత్రమే నమోదైంది. వచ్చే ఏడాదిలోనూ రాబడి వసూళ్లు ఇలాగే ఉంటే.. సర్కార్ మరిన్ని ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటూ ఆర్థికశాఖ బడ్జెట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి..
2024 25 బడ్జెట్‌లో కేంద్రం నుంచి రాష్ట్రం భారీగా నిధులను ఆశించింది. కానీ కేంద్రం అనుకున్న స్థాయిలో నిధులను విదిల్చలేదు. ఈ క్రమంలో 2025 26 బడ్జెట్ లోనూ కేంద్రం నుంచి అనుకున్నస్థాయిలో తెలంగాణకు కేటాయింపులు లేవు. అందుకే రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఆధారపడే బదు లు తానే స్వయంగా నిధుల సమీకరణపై దృ ష్టిసారిస్తున్నది.
ప్రత్యామ్నాయ మా ర్గాలను అన్వేషిస్తున్నది. అలా రూ.60 వేల కోట్ల వర కు సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూ మి విక్రయం, హడ్కో నుంచి రుణం, యంగ్ ఇండియా రెసిడెన్సియల్ పాఠశాలల భూ ముల కుదవ, హెచ్‌ఎండీఏ ద్వారా మరికొం త, సోషల్ ఇంపాక్ట్ బాండతో ఇంకొంత మొత్తాన్ని సేకరించే దిశగా అడుగులు వేస్తున్నది.
2024 ఆర్థిక సంవత్సరం అనుభ వాలను దృష్టిలో పెట్టుకొని, సొంత రాబడులతో పాటు ప్రత్యా మ్నాయంగా ఆర్థిక వన రుల సమీకరణపైనా సర్కార్ దృష్టి సారించింది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే 2025 బడ్జెట్ నాటికి ఆర్థిక ఇబ్బందు లు తప్పుతాయి. ఇక బడ్జెట్ సైజ్ కూడా రూ .3లక్షల కోట్లు దాటే అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకు 13సార్లు బడ్జెట్..
కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది తన తొలి పద్దును పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టింది. ఇక ఇప్పుడు తన రెండో పద్దు ను సిద్ధం చేస్తున్నది. తెలంగాణ సిద్ధించిన నాటి నుంచి ఇప్పటివరకు 13 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా, వీటిలో రెండు ఓట్ ఆన్ అకౌంట్ పద్దులు. మిగతావి 11 పూర్తిస్థాయి బడ్జెట్లు. 2014లో తొలిసారి నాటి ప్రభుత్వం రూ.1,00,637.96 కోట్లతో మొదటి పద్దు ప్రవేశపెట్టింది.