13-02-2025 01:45:14 AM
కేంద్ర బడ్జెట్‌పై నేడు నిర్వహణ
ఖైరతాబాద్, ఫిబ్రవరి 12: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాల, ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్, వాసవి క్లబ్ హైదరాబాద్ సంయుక్తంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర బడ్జెట్‌పై ‘బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్’ (డిగ్రీ, పీజీ విద్యార్థులకు)ను నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్ తెలిపారు. బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయన్నారు.
మధ్యాహ్నం 12:30గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. మొదటి బహుమతిగా రూ.3,000-, రెండవ బహుమతి రూ.2,000-, మూడవ బహుమతిగా రూ. ఐదుగురికి ప్రోత్సాహక బహుమతులు రూ.500 చొప్పున అందజేస్తారు. వివరాల కోసం 9052263033, 95730 9346978530, 9703476767, 9908615205, 9493976082 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు