20-03-2025 05:33:13 PM
జడ్పి మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి..
కాటారం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిగా ఉందని, అసమర్ధ పాలనకు నిదర్శనంగా నిలిచిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి విమర్శించారు. 100 రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి మాటలు నీటి మీది రాతలయ్యాయని దుయ్యబట్టారు. మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన పథకం ఆచరణలో ఆచూకీ లేకుండా పోయిందని, బడ్జెట్ లో ఆ ఊసే లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు అన్ని రంగాలను నిలువునా ముంచారని, బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదని అన్నారు.