వనపర్తి, ఫిబ్రవరి 5 ( విజయక్రాంతి ) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025 26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌గా ఉందని బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంధం మదన్ జిల్లాప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ ఆరోపించారు బుధవారం వనపర్తి పట్టణంలో బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించి అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినకార్మిక వ్యతిరేక బడ్జెట్ ప్రతులను రాజీవ్ గాంధీ చౌరస్తాలో దహనం చేసారు.
అనంతరం బొబ్బిలి నిక్సన్ మాట్లాడుతూ ఉపాధి కల్పన కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించా లేఖ పోవడం అన్యాయమని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డికె కురుమన్న టౌన్ అధ్యక్షులు బాలస్వామి కార్యదర్శి రాబర్ట్ బాలరాజు పుల్లన్న గట్టన్నా రవి పోగుమన్యం హనుమంతు బాల పీరు జి అంజి ఎల్లన్న విజయ్ కుమార్ భాస్కర్ నాగ శేషు దేవేందర్ నాగరాజు డి అంజి మురళి సామేలు రమేష్ ఏసు తదితరులు పాల్గొన్నారు