20-03-2025 01:30:00 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అ న్ని రంగాల శ్రేయస్సే పరమావధిగా, రాష్ట్ర అభివృద్దికి ఊతం కల్పించే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. రైతన్నలు, మహిళలకు లబ్దిచేకూరే విధంగా,యువతకు స్వయం ఉపాధి కల్పించే విధంగా కేటాయిపులున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాజీవ్ యువ వికాసం, సాగునీరు, పట్టణాల అభివృద్ధితో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిచాలని నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. పారిశ్రామి క రంగం ప్రోత్సాహానికి రూ.3,527 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు.
అంబేద్కర్‌కు అవమానం..
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను బీజేపీ అవమానిస్తోందని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇందిరాభవన్‌లో జరిగిన జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమానికి మహేశ్‌కుమార్ హాజరయ్యారు. అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అహంకార పూరిత వ్యాఖ్యలు చేసినట్లు గుర్తు చేశారు.
రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రతోనే అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘జై బాపు, జై భీమ్, సంవిధాన్’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.