calender_icon.png 24 March, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకెల్లో మాత్రమే విద్యకు బడ్జెట్

20-03-2025 02:16:16 AM

విద్యాశాఖకు అంకెల్లో మాత్రమే బడ్జెట్ కేటాయింపులు పెంచినట్లు కనిపిస్తుంది తప్ప శాతాల్లో చూస్తే గత సంవత్సరం కంటే తగ్గింది. ఈ సంవత్సరం రూ. 304,965 కోట్ల బడ్జెట్ లో విద్యకు రూ. 23,108 కోట్లు (7.57 శాతం) కేటాయించారు. గత ఏడాది రూ. 274,058 కోట్ల బడ్జెట్ లో విద్య కోసం రూ. 21,292 కోట్లు (7.77 శాతం) కేటాయించారు.

అంకెల్లో ఈసారి రూ. 1816 కోట్లు పెరిగినట్లు కనిపిస్తున్నా శాతాల్లో చూస్తే గతంలో కంటే తగ్గింది. విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,067 పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల పై మాత్రమే ప్రభుత్వం దృష్టి పెడుతున్నది. గురుకులాల్లో చదివేది 5.5 లక్షల మంది పిల్లలు మాత్రమే. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 16 లక్షల మంది. వీరిలో అత్యధికులు బడుగు బలహీన వర్గాలకు చెందినవారే. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండారపు చక్రపాణి