calender_icon.png 8 January, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1.17 లక్షల కోట్లు ఎలా?

30-12-2024 02:51:06 AM

  1. సర్కారును కలవరపెడుతున్న కాగ్ నివేదిక 
  2. ఈ ఆర్థిక సంవత్సరం నిరాశాజనకంగా ‘సొంత రాబడి’ 
  3. నవంబర్ వరకు కేవలం 46.69 శాతం లక్ష్యం
  4. తారుమారైన బడ్జెట్ అంచనా.. మిగిలింది నాలుగు నెలలే
  5. నెలకు రూ.29 వేల కోట్ల చొప్పున రాబడి వస్తేనే టార్గెట్ పూర్తి
  6. ప్రభుత్వానికి సవాల్‌గా మారిన ఆమ్దానీ పెంపు

2024-25 బడ్జెట్‌లో సొంత రాబడి రూ.2.21లక్షల కోట్ల మేరకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ లక్ష్యంలో ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి రూ.1.03 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజా నాకు చేరింది. నవంబర్‌లో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రభుత్వ లక్ష్యం నెర వేరాలంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ప్రభుత్వం మరో రూ.1.17లక్షల కోట్ల ను రాబట్టాల్సి ఉంటుంది..

ఎనిమిది నెల ల్లో రూ.1.03 లక్షల కోట్ల ఆదా యాన్ని మాత్రమే ఆర్జిం చిన ప్రభు త్వం, మిగిలిన నాలుగు నెల ల్లో రూ.1.17లక్షల కోట్ల రాబడి సాధించడం ఇప్పు డు అతిపెద్ద సవాల్‌గా మారింది.

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుకోవడమే కష్టమనుకుంటే రాష్ట్రప్రభుత్వం తర్వలో అనేక కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నది. లోటు రాబడితో రాష్ట్ర ఖజానా తీవ్ర మైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ సర్కార్ కత్తి మీద సాము చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

2024 బడ్జెట్‌లో ఆశించిన మేరకు ఆదాయం  లేదని, కనీసం సొంత రాబడులు (రెవెన్యూ ఆదాయం) సైతం అంతంతమాత్రమేనని నవంబర్‌లో విడుదలైన కాగ్ నివేదిక వెల్లడిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి నవంబర్ వరకు రాబడి 50శాతం కూడా మించకపోవడం గమనా ర్హం. కేవలం రూ.1.03 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అంటే.. ఇది బడ్జెట్ అంచనాల్లో కేవలం 46.69శాతమే.

ఈ చొప్పున నెలకు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. 12,912కోట్ల ఆదాయం మాత్రమే. బడ్జెట్ అంచనా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ప్రభుతం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.1.17 లక్షల కోట్ల రాబడిని సమకూర్చుకోవాల్సి ఉంది. అంటే నెలకు రూ.29 వేల కోట్ల చొప్పున ఆదాయం వస్తే తప్ప అది సాధ్యం కాదు. ఇలా కాగ్ నివేదిక ఇటు ప్రభుత్వాన్ని, అటు ఆర్థిక శాఖను కలవరపాటుకు గురిచేస్తున్నది.

తలనొప్పిగా నిధుల సమీకరణ..

సంక్షేమ సంక్షే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి. ఈ చొప్పున నెలనెలా ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నా యి. రోజురోజుకూ గృహజ్యోతి, మహాలక్ష్మి, ఉచిత గ్యాస్ సిలిండర్ భారమూ పెరుగుతున్నది. మరోవైపు ప్రభుత్వం కొత్త పథకా లనూ ప్రారంభించాలనుకుంటున్నది.

దీని లో భాగంగానే జనవరిలో రైతుభరోసా పథ కం అమలుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఒక్కసారి పథకం అమలైతే ఇటు రైతులకు ఎక రానికి ఏడాదికి రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తొలి విడత నిధులు రూ.7,700 కోట్లు వెచ్చించాల్సి ఉన్నది.

ఇక పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల నుంచి డిమాండ్ మొదలవడంతో ఆ పథకంపైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన పరిస్థితి. మహిళలకు వడ్డీలేని రుణాలు, ఇంటిగ్రేటేడ్ రెసిడెన్సియల్ స్కూ ళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వేల కోట్లలో నిధులు కావాలి. ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే ఆమ్దానీని పెంచుకుం టే తప్ప సాధ్యం కాదు. 

ఆదాయ లోటు 24శాతం..

ఏప్రిల్- నవంబర్ వరకు బడ్జెట్ అంచనాల్లో 70శాతం వరకు రాష్ట్ర ఖజానాకు చేరాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకు 46శాతం ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ చొప్పున రాబడి లోటు 24శాతం. ప్రభుత్వ సొంత రాబడుల పరిధిలోని ఏ ఒక్క విభాగం నుంచైనా వందశాతం లక్ష్యం పూర్తి కాలేదు. సేల్స్ ట్యాక్స్‌తో పాటు కేంద్ర పన్నుల్లో వాటా అంశాలు మాత్రమే బడ్జెట్ అంచనా ల్లో 60శాతం లక్ష్యాన్ని దాటాయి.

మిగతా అన్ని విభాగాల్లో రాబడి అంతంతమాత్రంగానే ఉంది. జీఎస్టీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్‌పై పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరలేదు. లోటు ఎలా పూడ్చుకోవాలి ? అన్ని రాష్ట్రప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లు సమా చారం. లక్ష్యం నెరవేర్చుకునే మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవడం ఏ మేరకు ప్రభుత్వానికి సాధ్యమన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్నది.