22-03-2025 01:54:46 AM
ఎమ్మెల్సీ కోదండరాం
హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం మండలిలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో అంచనాలకు వాస్తవ ఖర్చులకు మధ్య 20శాతం తేడా ఉండేదని, కాంగ్సెస్ పద్దు అలా లేదన్నారు.
ఈ రెండింటి మధ్య తారతమ్యాలు ఉండటం వల్లే అప్పులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. అ యితే ఈ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించిందన్నారు. అలాగే, వారసత్వంగా వచ్చి న అప్పుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.