21-03-2025 12:00:00 AM
హనుమకొండ, మార్చి 20 (విజయ క్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన గురువారం జరిగింది. 2025- -2026 సంవత్సరానికి రూ.1071.48 కోట్ల బడ్జెట్ అంచనాలతో రూపొందించిన బడ్జెట్ను పాలకవర్గం ఆమోదించింది. బల్దియా అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అంగీకారంతో పాలకవర్గం బడ్జెట్ను ఆమోదించారు.
ఇందులో రూ. 337 కోట్ల 38 లక్షలు, సాధారణ పన్ను ద్వా రా రూ. 728 కోట్ల 10లక్షలు వివిధ గ్రాండ్ల ద్వారా రూ. 609 కోట్లు డిపాజిటర్లకు కేటాయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు తోపాటు అధికార విపక్ష కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.