- బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల నిరసన
- మేయర్ ఛాంబర్ ఎదుట బైఠాయింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31(విజయక్రాంతి): బల్దియా బడ్జెట్ సమావే మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధా కార్యాలయంలో నిరసన తెలిపారు. మే ఛాంబర్ ఎదుట బైఠాయించి.. మే డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి వారు లేఖ రాశారు.
అనం బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. కౌన్సిల్‌లో తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని.. మార్షల్స్‌తో గెంటించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు కాంగ్రెస్ కార్పొరేటర్లు తమపట్ల దురుసుగా ప్రవర్తించారని విమర్శించారు. బడ్జెట్‌పై చర్చ లేకుండానే ఏకపక్షంగా ఆమోదించారని ఆరోపించారు.
కార్యక్రమంలో మన్నె కవితారెడ్డి, హేమ సామల, రసూరి సునీత, సింధూరెడ్డి, శాంతిరెడ్డి, దేదీప్యారావు తదితరులు పాల్గొన్నారు. అయితే బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల నిరసనకు ప్ర కాంగ్రెస్ కార్పొరేటర్లతో మేయర్ గద్వాల విజయలక్ష్మి భేటి ఆయ్యారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల ఆందోళనకు కౌంటర్ ఇచ్చే వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.