మంథని (విజయక్రాంతి): మంథని మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బుద్ధార్తి సత్యనారాయణను రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ నియమించారు. పెద్దపెల్లి జిల్లా మంథని మండలంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్నూరు కాపు సంఘం మంథని మండల అధ్యక్షుడిగా బుద్ధార్తి సత్యనారాయణను మంథని మండల ప్రధాన కార్యదర్శిగా ఈసంపల్లి ప్రసాద్ ను మంథని మండల ఉపాధ్యక్షుడిగా బండి మహేష్ ను నియమించారు.
వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఇమ్మిడిశెట్టి మోహన్, మున్నూరు కాపు యువత పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు తోకరి సురేష్, కుల బాంధవులు కాసర్ల శ్రీనివాస్, దేవరకొండ ఓదెలు, విద్యార్థి శ్రీనివాస్ దేవరకొండ సతీష్, తిరుపతి, రాకేష్, మహేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.