calender_icon.png 24 December, 2024 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధుడి బోధనలు అనుసరణీయం

15-10-2024 12:33:37 AM

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

బుద్ధవనంలో దమ్మ విజయ వేడుకలు 

నల్లగొండ, అక్టోబర్ 14 (విజయక్రాంతి): గౌతమ బుద్ధుడి పంచశీల సూత్రాలు మానవాళికి అనుసరణీయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన దమ్మ విజయ వేడుకల్లో ఆయన మా ట్లాడారు.

బుద్ధుడు తన బోధనలతో సామాజిక రుగ్మతులను రూపుమాపారని పేర్కొ న్నారు. కళింగయుద్ధంలో అపార నష్టం చూసి చలించిన అశోక చక్రవర్తి శాంతిని కాంక్షిస్తూ విజయదశమి రోజే బౌద్ధాన్ని స్వీకరించారని గుర్తు చేశారు.

దమ్మ విజయం వేడుక ద్వారా చరిత్రను నేటితరానికి తెలియజేసిన పర్యాటకశాఖను మండలి చైర్మన్ అభినందించారు. వేడుకల్లో ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఎండీ ప్రకాశ్‌రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, బుద్ధవనం ఓఎస్డీ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.