calender_icon.png 19 April, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న బుద్ధ నాగరాజు

16-04-2025 08:31:07 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): ఎన్ని రోజులు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యం... సమాజంలో మానవత్వం ఇంకా మిగిలె ఉందని కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది. బ్రతుకు తెరువు కోసం వచ్చి జగదేవపూర్ ఎల్లమ్మ దేవాలయం వెనుకల వెంకటయ్య కుటుంబంతో పూరి గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వెంకటయ్య భార్య బుధవారం చింతల భాగ్యమ్మ (45) అనారోగ్యంతో మృతి చెందారు. ఏదో ఒక పని చేసుకుంటేనే ఆరోజు పూట గడిచే పరిస్థితి వాళ్ళది. భాగ్యమ్మ మృతి చెందడంతో ఏం తోచని స్థితిలో ఉన్న కుటుంబం. విషయం తెలియడంతో స్థానిక గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగరాజు వారి ఘటన స్థలానికి వెళ్లి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య, సడల కర్ణాకర్, మహేష్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.