calender_icon.png 29 September, 2024 | 1:45 AM

బుడమేరు @8000 క్యూసెక్కుల ప్రవాహం!

05-09-2024 12:46:43 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఈ రోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందన్న అధికారుల అంచనాల మేరకు గండ్లను పూడ్చే పనులను మంత్రి లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. విజయవాడను చిగురుటాకులీలా వణికించిన బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. గండిని పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికి ఒక గండిని పూడ్చారు. మిగిలిన రెండు గండ్ల ను పూడ్చే పనులు జరుగుతున్నాయి. పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. గండ్లను పూడ్చే ప్రక్రియను  ఆయన పర్యవేక్షిస్తున్నారు.