13-03-2025 11:00:33 PM
భద్రాచలం,(విజయక్రాంతి): కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, టీపీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అద్దంకి దయాకర్ అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం శ్రమించారని, అధికార ప్రతినిధిగా పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గళం విప్పారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని, ప్రజల్లో విశ్వసనీయతను సాధించిన నాయకుడిగా అద్దంకి దయాకర్ తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందడం విశేషం అన్నారు. అనేక సందర్భాల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తన టికెట్‌ను త్యాగం చేసి వేరే అభ్యర్థికి అవకాశం కల్పించిన అద్దంకి దయాకర్‌కు ఇప్పుడు పార్టీ గౌరవం అందించడం హర్షణీయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తుందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం పెంచిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బోగల శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సరెల్ల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బలుసు సతీష్, అలాగే కోటేష్, కృష్ణా రెడ్డి, సరెళ్ళ వెంకటేష్, రాగం సుధాకర్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.