calender_icon.png 29 September, 2024 | 8:56 AM

బుచ్చమ్మది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

29-09-2024 12:39:25 AM

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 28(విజయ క్రాంతి): బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, ముమ్మటికి తెలంగాణ ప్రభుత్వ హత్యేనని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరో పించారు. హైడ్రా భయంతో బుచ్చమ్మ శుక్ర వారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. శనివారం ఎంపీ ఈటల బుచ్చమ్మ కుటుంబ సభ్యులను పరామ ర్శించి, ఆమె మృతదేహానికి నివాళి అర్పిం చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ హైడ్రా అధికారులు వందల మంది పోలీసు ల సమక్షంలో షెడ్లు, ఇండ్లను కూల్చివేస్తున్నా రని, భూమిని తాము కొనుగోలు చేశామని బాధితులు పట్టాలు చూపెడుతున్నా వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా అధికారుల ఒత్తిళ్లతోనే బుచ్చ మ్మ ఆత్మహత్య చేసుకుందన్నారు. వేలాది మంది చెరువుల పక్కన శాశ్వత నిర్మాణాలు చేసుకున్న వారు బిక్కుబిక్కుమంటూ గడుపు తున్నారన్నారు.

నిబంధనలు పేదలకే పర్తింప జేస్తూ.. వారు పైసాపైసా కూడబెట్టి కట్టుకు న్న ఇళ్లను కూల్చేస్తున్నారన్నారు. కానీ పెద్దల వైపు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు. శని, ఆదివారాలు వచ్చాయంటే చాలు ఎక్కడ హైడ్రా వారు తమ ప్రాంతానికి వచ్చి ఇళ్లు కూలగొడతారని ప్రజలు భయపడా ల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలను ఏడిపించి, వాళ్లతో కంటతడి పెట్టిస్తున్నారన్నారు. గతంలో అనేక సీఎంలను చూశాంగానీ ఇలా నియంత ముఖ్యమంత్రిని చూడటం ఇదే మొదటిసారన్నారు. ఈ తప్పులన్నింటికీ రేవంత్‌రెడ్డి మూల్యం చెల్లించకోక తప్ప దన్నారు. హైడ్రా బాధితులకు బీజేపీ అండ గా ఉంటుందని భరోసానిచ్చారు.