calender_icon.png 21 January, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభించిన పది రోజుల్లోనే ఆగిన బీటీ రోడ్డు పనులు?

21-01-2025 01:49:26 AM

  • ఊపందుకోని మక్తమాధారం

నాగిరెడ్డిగూడ తండా బీటీ రోడ్డు పనులు 

మట్టి రహదారితో  వాహనదారుల అవస్థలు

కడ్తాల్, జనవరి 20 ( విజయ క్రాంతి ): పనులు ఇలా ప్రారంభించి ఆలా నిలిపారు. దీంతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం నుంచి  నాగిరెడ్డిగూడ తండా వరకు ఉన్న మట్టి రోడ్డును బిటిగా మార్చేందుకు ప్రభుత్వం రూ. 1.20కోట్లు నిధులు మంజూరు చేసింది.  బీటీ రోడ్డు పనులను ఇటీవల ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారం భించారు.

కానీ పనులు ప్రారంభమైన పది రోజుల్లోనే గుత్తేదారు పనులు నీలిపేశారు. ఈ రోడ్డును బీటీగా మార్చితే ప్రజా రవాణా సులభం అవుతుందని, ఇటీవల ప్రారంభ మైన రోడ్డుపనులతో సంబరపడ్డ ప్రజలు నిరాశకు గురయ్యారు.  మట్టి రోడ్డుపై వాహనాలను నడపలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు.  నాలుగేళ్లుగా ఈ రోడ్డు మరమత్తులను అధికారులు పట్టించు  గ్రామస్థులు సొంత డబ్బులతో మరమత్తులు చేయించు కున్నారు. 

 బీటీ రోడ్డు పనులు ప్రారంభతో  ప్రజలు ఎంతో సంబురపడ్డ నేటికీ అ పనులు నత్తనడకన సాగుతున్నాయి.  పంచాయితీ రాజ్ అధికారులు మాత్రం ఈరోజు, రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డు నిర్మాణం పనులు ఆపకుండా త్వరగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.