calender_icon.png 20 April, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు నెలలకే ధ్వంసమైన బీటీ రోడ్డు

12-04-2025 12:02:47 AM

రాకపోకలకు ఇబ్బంది పడు తున్న వాహన దారులు మెయింటెనెన్స్ చేయని కాంట్రాక్టర్ పట్టించుకోని అధికారులు

 మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 11 (విజయక్రాంతి): కాంట్రాక్టర్ ధన దా హానికి, అధికారుల నిర్లక్ష్యానికి లింగాపూర్ రోడ్డు అద్దం పడుతోంది. రోడ్డు వేసిన రెండు నెలలకే ద్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ మండలం దబిలిపూర్ నుంచి లింగాపూర్ వరకు బీటీ  రోడ్డు నిర్మా ణానికి 2023లో అప్పటి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రూ . 58 లక్షలు మంజూరు చేయించారు. 

2023 జనవరి 25న  రోడ్డు శంకుస్థాపన చేశారు. అధికారుల పర్యవేక్షణ సక్రమంగా చేయలేకపోవడంతో పనులు చేపట్టిన సదరు కాంట్రా క్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవ డం వల్ల  బీటీ  వేసిన రెండు నెలలు గడవక ముందే అప్పట్లోనే ధ్వంసం అయింది. అప్పటినుంచి గుంతలు అలాగే ఉన్నాయి. కాంట్రాక్టర్ కనీసం మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు.

గుంతలతో ప్రయాణదారులకు తీవ్ర ఇబ్బందులు

    రోడ్డుమీద గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకప్రాయంగా తయారయిం ది. బీటీ రోడ్డుకు ఇరువైపులా మొరం వేయాల్సి ఉండగా అది కూడా వేయలేదు. దీంతో రోజురోజుకు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు  రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పంచాయతీ రాజ్ ఏ.ఇ వివరణ  

 ఈ విషయంపై  పంచాయతీరాజ్ ఏ.ఇ స్ఫూర్తి ని వివరణ కోరగా విషయం తమ దృష్టికి రాలేదని, రోడ్డును పరిశీలించిన తర్వాత వివరాలు తెలుపుతామని అన్నారు.