calender_icon.png 28 April, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్‌ఎస్11.. కిష్కింధపురి

28-04-2025 01:13:59 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 11వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి హర్రర్-మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే, ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కిష్కింధపురి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వెల్లడించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కథానాయకి అనుపమ పరమేశ్వరన్ ఎక్సయిటింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపిస్తు న్నారు.

ఇద్దరూ తమ చేతిలో జ్వాలలు పట్టుకుని అడవిలో ఏదో వెతుకుతున్నట్టు ఉందీ పోస్టర్. ఏప్రిల్ 29న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తామనే విషయాన్ని కూడా మేకర్స్ ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: చిన్మయ్ సలాస్కర్; సంగీతం: సామ్ సీఎస్; ఆర్ట్: డీ శివకామేశ్; ఎడిటర్: నిరంజన్ దేవరమానే.