calender_icon.png 19 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలీల జనాభాకు తగినంత రాజకీయ అవకాశాలు బీఎస్పి కల్పిస్తుంది

05-03-2025 05:48:10 PM

భద్రాచలం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, చర్ల మండల ఇన్చార్జి సామల ప్రవీణ్...

చర్ల (విజయక్రాంతి): మండల బహుజన సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం చర్ల మండల బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు కొండా కౌశిక్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, చర్ల మండల ఇన్చార్జ్ సామల ప్రవీణ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో 2వ అతిపెద్ద జనాభా కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు రాజకీయ అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందాయని, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే పద్మశాలి సామాజిక వర్గానికి జనాభాకు తగినంత రాజకీయ అవకాశాలు కల్పిస్తుందని, అందుకు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న పద్మశాలి సామాజిక వర్గ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

మండల కేంద్రంలోని పద్మశాలి సామాజిక వర్గ జనాభాలో ఓట్లల్లో అధికంగా ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా వారికి రాజకీయ పదవుల్లో పద్మశాలీలను నాయకులుగా తీసుకోవడం లేదని, వారి రాజకీయ ఎదుగుదలకు ఎటువంటి ప్రోత్సాహం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ విధానమైన ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అనే నినాదంతో ఏర్పడ్డ రాజకీయ పార్టీ అవడంతో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాకు మండల ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చిందని, అలాగే బహుజన సమాజ్ పార్టీలో ఇతర బీసీ కులాలకు అంతే ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని, దానిని అందిపుచ్చుకోవడానికి బీసీ సామాజిక వర్గం అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ కార్యదర్శి చల్లగుండ్ల సతీష్ చౌదరి, ఉపాధ్యక్షులు చెన్నం మోహన్, ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేశ్వర్లు, కోశాధికారి పంబి కుమారి పాల్గొన్నారు.