calender_icon.png 17 April, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్పీ మండల కమిటీ నియామకం

08-04-2025 08:14:37 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్షేట్టిపేట మండల కమిటీ ని మంగళవారం స్థానిక గురునానక్ గార్డెన్స్ లో జోనల్ కో -ఆర్డినేటర్ కాదాసి రవీందర్, జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు మోత్కూరి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో నియమించారు. ఈ సందర్భంగా జోనల్ కో-ఆర్డినేటర్ కాదాసి రవీందర్ మాట్లాడుతూ... భారత రాజ్యాంగంను, బహుజన సమాజపు హక్కులను కాపాడేది కేవలం బీఎస్పీ పార్టీ మాత్రమేనని వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి కృషి చేసేదే బీఎస్పీ అని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడానికే కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు మోత్కూరి నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా పని చేయడమే బీఎస్పీ లక్ష్యమన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులుగా బెక్కం సృజన్, ప్రధాన కార్యదర్శి గా దీటి శరత్ కుమార్, ట్రెజరర్ గా బోనగిరి మహేష్,జాయింట్ సెక్రటరీగా చిప్పకూర్తి సంతోష్, సభ్యులు చొప్పదండి ప్రశాంత్, మెడపట్ల శ్రీ వరుణ్, బిరుదుల రవి,అడ్లూరి రాజశేఖర్, బంటి, సంజయ్, శేఖర్,కొల్లూరి ప్రశాంత్, రాము తదితరులు పాల్గొన్నారు.