calender_icon.png 26 February, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలసిపోయాను.. ఆక్సిజన్ అందించి గెలిపించండి

26-02-2025 01:13:47 AM

కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 25: ఈ గుండె అలసిపోయిందని... ఆలసిన గుండెకు ఆక్సిజన్ అందించి గెలిపించాలని బీఎస్పీ అభ్యర్థి ప్రనన్న హరికృష్ణ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కరీంనగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పట్ట భద్రుడి గుండెను తాను ట చేశానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే ఏమి చేయగలడు అనేది గ్రౌం డ్‌లెవల్‌కు తీసుకెళ్లానని, చేసి చూపిస్తానని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంటే అలంకార ప్రాయం కాకూడదని అన్నారు.

డబ్బులు ఉంటేనే రాజకీయం చేయవచ్చు అనేది పోవాలని, బలహీనవర్గాల బిడ్డ ఎందుకు రాజకీయం చేయవద్దు అనే అంశంతో నేను టార్చ్ బేరర్ కావాలని ముందుకు వచ్చానని అన్నారు. ఒకరు పారిశ్రామికవేత్త, ఇంకొకరు కార్పొరేట్ విద్యావేత్త, వీళ్లు ఎందుకు రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి సంబంధం లేని వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చి పోటీలో నిలిచానని అన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం రాజీనామా చేసి ముందుకు వచ్చానని అన్నారు.

రాజకీయాల్లో డబ్బు ప్రామాణికం కాదని, నేను గెలవకపోతే నా లాంటి వాళ్లు మొగ్గ దశలోనే తుంచిపోయినట్లేనని అన్నారు. కేంద్రం, రాష్ర్టంలో అధికారంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొని పోటీలో ఉన్నానని, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ మీ అభ్యర్థి పోటీలో లేనందున తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. నేను మహిళలకు వెన్నుదన్నుగా ఉంటానని, విద్యార్థులకు సపోర్ట్ ఉంటానని, బాండ్ పేపర్లో 8 అంశాలు పెట్టి సింహ గర్జనలో మీ ముందు పెట్టానని అన్నారు.

ముఖ్యమంత్రి మూడు సమావేశాల్లో పాల్గొని పట్టభద్రుల కోసం వారిని ప్రభావితం చేసే అంశాలు మాట్లాడారా అని ప్రశ్నించారు. నేను గెలిస్తే కాంగ్రె స్లోకి పోతాను అంటున్నారని, ఎట్టి పరిస్తితుల్లో వెళ్లనని, రాహుల్ గాంధీ ఒక్క చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. నాకు మద్దతు ఇచ్చిన అందరికీ నేను ఆరేళ్లపాటు మీ సేవ లో ఉంటానని అన్నారు. విజ్ఞతతో ఆలోచించి తనకు ఓటు చేయాలని విజ్ఞప్తి చేశారు.