calender_icon.png 18 January, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీఎస్పీ

17-01-2025 08:26:36 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఫిబ్రవరి 5న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections)కు బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) అధ్యక్షురాలు కుమారి మాయావతి(BSP President Kumari Mayawati) సూచనల మేరకు 70 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాబితాలో అనుభవజ్ఞులైన నాయకులతో పాటు కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా లాల్ సింగ్, సుందర్ లోహియా, ముఖేష్ కుమార్, జుగ్వీర్ సింగ్ పేర్లు ఉన్నాయని బీఎస్పీ కేంద్ర సమన్వయకర్త నితిన్ సింగ్ అన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడుతలో జరుగగా, ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.