06-03-2025 12:00:00 AM
ఇబ్బందుల్లో వినియోగదారులు
కొండాపూర్, మార్చి 5 : అనంతసాగర్ సైదాపూర్ మారేపల్లి లో బిఎస్‌ఎన్‌ఎల్ నెట్ వర్క్ పనిచేయక వినియోగదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. కొండాపూర్ మండలంలోని అనంతసాగర్ మారేపల్లి సైదాపూర్ గ్రామాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ నెట్ వర్క్ పనిచేయక ఫోన్లు మాట్లాడడానికి వినియోగదారులు అంతారాయంతో సతమతమవుతున్నారు.
ఇంటర్నెట్ సిగ్నల్స్ కూడా గ్రామాల్లో పని చేయక ఇళ్లలో ఫోన్లు రాక అవస్థలు పడుతున్నామని బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను పెంచాలని చూస్తున్న కింది స్థాయిలో సర్వర్ నెట్ వర్క్ పనిచేయక బిఎస్‌ఎన్‌ఎల్ వైపు వినియోగదారులు ఆసక్తి చూపకపోవడానికి బిఎస్‌ఎన్‌ఎల్ అధికారుల పనితీరు నిదర్శనంగా చెప్పు కోవచ్చు.
పది రోజులుగా బిఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్స్ గ్రామాల్లో రావడంలేదని ఇంటర్నెట్ అసలే పని చేయడం లేదని సైదాపూర్ బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు చెబుతున్నారు.
బిఎస్‌ఎన్‌ఎల్ నెట్వర్క్ తో మొబైల్ ఫోన్ లో ఉన్న లాభం లేకుండా పోతుందని సెల్ ఫోన్ నెట్ , సిగ్నల్స్ మరమ్మతులు చేయాల్సిన బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వినియోగ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనంతసాగర్, మారేపల్లి, సైదాపూర్ లో బిఎస్‌ఎన్‌ఎల్ మెరుగుపరచాలని మొబైల్ వినియోగ దారులు కోరుతున్నారు.