- పార్లమెంటులో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) నష్టాలు తగ్గినట్లు కేంద్రం పార్లమెం టుకు తెలియజేసింది. 2023-24 ఆర్థిక సం వత్సరంలో సంస్థకు రూ.2164 కోట్లు కాగా.. 2024-25లో నష్టాలు రూ.5371 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన నష్టం రూ.8,161 కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ బుధవారం లిఖితపూర్వక సమాధా నం ఇచ్చారు.
కేంద్రం చర్యలు, ఇస్తున్న ప్యాకేజీల కారణంగా బీఎస్‌ఎన్‌ఎల్/ ఎంటీఎన్ ఎల్ 2020-21 నుంచి ఆప రేటింగ్ ప్రాఫి ట్స్ అందుకుంటున్నాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో 4జీ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్ లక్ష 4జీ సైట్లను ఆర్డర్ చేసిందని, వీటిని సులువుగా 5జీకి అప్‌గ్రేడ్ చేయొచ్చన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను పునరుద్ధరించడానికి కేంద్రం అనేక చర్యలు చేప డుతోందని చెప్పారు. 2019లో రూ.69వేల కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీ కేంద్రం అందించిందని, 2022లో మరో రూ.1.64 లక్షల కోట్లు ప్యాకేజీ రూపంలో అందించిందని పేర్కొన్నారు.
రూ.89 వేల కోట్ల విలువై న 4జీ/5జీ స్పె్రక్ట్రంను 2023లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం కేటాయించిందని చెప్పారు. మరోవైపు టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌కు రూ.లక్ష కోట్ల పైనే కేటాయించడం విశేషం. ముఖ్యంగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో సాంకేతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసం రూ. 82,916 కోట్లను కేటాయించారు.