calender_icon.png 29 December, 2024 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబ్బంది తగ్గింపుపై బీఎస్‌ఎన్‌ఎల్ దృష్టి

29-12-2024 01:19:37 AM

* టెల్కోలో 35% ఉద్యోగులు ఇంటికి?

* మరోసారి వీఆర్‌ఎస్ ప్రకటించనున్న సంస్థ

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వరంగ సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి స్వచ్చంద పదవీ విరమణ పథకాన్ని(వీఆర్‌ఎస్) అమలు చేయడానికి ప్రయత్నిస్తో ంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదాన్ని కోరే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీఆర్‌ఎస్ ద్వారా దాదాపు 35% ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తోందని తెలిసింది.

టెల్కోలో ఉద్యోగుల సంఖ్యను వీఆర్‌ఎస్ ద్వారా తగ్గించాలని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతిపాదన పంపినట్లు వార్తలు వస్తున్నాయి. వీఆర్‌ఎస్ అమలు కోసం ఆర్థిక శాఖ నుంచి రూ. 15 వేల కోట్లను ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం  సంస్థకు వచ్చే ఆదాయంలో రూ.7,500 కోట్లను ఉద్యోగుల జీతాలకు చెల్లిస్తున్నది. ఈ ఖర్చును రూ.5000 కోట్లకు తగ్గించాలని కంపెనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆర్థికమంత్రిత్వ శాఖతో పాటు క్యాబినెట్ ఆమోదం తెలిపితే వీఆర్‌ఎస్‌ను వెంటనే అమలు చేయనున్నారు. 

చర్చల్లోనే వీఆర్‌ఎస్..

వీఆర్‌ఎస్ అమలు ఆలోచన ఇంకా అ ంతర్గత చర్చల్లో ఉందని, తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. 201 9లో బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ సంస్థలకు  రూ. 69 వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని కేంద్రం అందించింది.