calender_icon.png 1 November, 2024 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్‌ఎఫ్ చీఫ్‌కు ఉద్వాసన

03-08-2024 05:01:37 AM

డిఫ్యూటీ చీఫ్‌ను కూడా తొలగించిన కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 2:  పారామిలిటరీ దళం బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌తోపాటు డిఫ్యూటీ డైరెక్టర్ జనరల్‌ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తొలగించింది. వారిని వెంటనే తమతమ రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. బీఎస్‌ఎఫ్ డీజీగా నితిన్ అగర్వాల్, డిఫ్యూటీగా స్పెషల్ డీడీ (వెస్ట్) వైబీ ఖురానియా ఉన్నారు. అగర్వాల్ 1989 కేరళ బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ఖురానియా 1990 బ్యాచ్ ఒడిశా క్యాడర్ అధికారి. వీరిని తొలగిస్తూ క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ వేర్వేరు ఆదేశాలు జారీచేసింది. సంస్థపై నియంత్రణ లేకపోవటం వల్లనే వారిని తొలగించినట్టు వెల్లడించింది.