calender_icon.png 5 January, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్‌ను అస్థిరపరిచేందుకు బీఎస్ఎఫ్ ప్రయత్నిస్తోంది

02-01-2025 07:09:01 PM

కోల్‌కతా,(విజయక్రాంతి): బంగ్లాదేశ్ నుండి చొరబాటుదారులను భారతదేశంలోకి ప్రవేశించడానికి సరిహద్దు భద్రతా దళం(Border Security Force) అనుమతించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(West Bengal Chief Minister Mamata Banerjee) గురువారం ఆరోపించారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బీఎస్ఎఫ్(BSF) ప్రయత్నిస్తుందన్నారు. బీఎస్ఎఫ్ వైఖరి వెనుక కేంద్ర ప్రభుత్వం బ్లూ ప్రింట్ ఉందని తాను గ్రహించగలనని బెనర్జీ పేర్కొన్నారు. ఇస్లాంపూర్, సీతాయ్, చోప్రా అనేక ఇతర సరిహద్దు ప్రాంతాల ద్వారా చొరబాటుదారులను భారతదేశంలోకి ప్రవేశించడానికి బీఎస్ఎఫ్ అనుమతిస్తున్నట్లు తామ దగ్గర సమాచారం ఉందన్నారు.

బీఎస్ఎఫ్ కూడా ప్రజలను హింసించి రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ సచివాలయంలో జరిగిన పరిపాలనా సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అన్నారు. గూండాలు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుకు ఇరువైపులా శాంతిని కోరుకుంటున్నామని, పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌తో తామకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన చొరబాటుదారులు ఎక్కడెక్కడ ఉంటున్నారో తేల్చాలని డీజీపీ రాజీవ్ కుమార్‌ను ఆదేశించారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీనికి బాధ్యులను చేయడానికి బీఎస్ఎఫ్ ప్రయత్నిస్తుందని మమతా బెనర్జీ మండిపడ్డారు.