దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం సూచీలు భారీ నష్టాలలో కొనసాగుతున్నాయి. ఆరంభంలో సెన్సెక్స్ 2400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ 24300 దిగువన ఖాతా తెరిచింది. దీంతో ట్రేడింగ్ మొదట్లోనే మదుపర్ల సంపద 14 లక్షల కోట్లు ఆవిరయ్యాయి (బీఎస్ఈ, నమోదిత సంస్థల మార్కెట్ విలువ ప్రకారం). దీనికి కారణం అమెరికాలో నిరుద్యోగిత రేటు పెరగడంతో ఏర్పడ్డ మాంద్యం భయాలు, జపాన్లో వడ్డీ రేట్లు పెరగడంతో మదుపర్లు అమ్మకాలకు వెళ్లడం, ఇజ్రయిల్ ఇరాన్ యుద్ధం.. చమురు కేంద్రమైన పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు అంటున్నారు.