25-02-2025 09:01:31 PM
హత్య కేసును 6 గంటల్లో ఛేదించిన పోలీసులు..
వివరాలను వెల్లడించిన డీఎస్పీ జీవన్ రెడ్డి..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలో ఓ యువకుని దారుణ హత్య ఘటన కలకలం రేపింది. స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలోని ఇందిరానగర్ వద్ద రవితేజ (26) అనే యువకున్ని ముగ్గురు దారుణంగా హత్య చేశారు. కాగా ఈ హత్య కేసును జిల్లా పోలీసులు ఆరు గంటల్లోనే చేదించడం విశేషం. మంగళవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు గోవింద్ కార్తిక్, ప్రణీత్, సాయి కిరణ్ లు జల్సా లకు అలవాటుపడి అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్న క్రమంలో ఒక గ్యాంగ్ గా ఏర్పడి డ్రైవర్ గా పని చేస్తున్న కొమ్మవార్ రవితేజను సైతం తమతో తిరుగుతూ కలిసి నేరాలకు పాల్పడదామని ఆలోచనతో అతనిని ప్రేరేపించడంతో కానీ అతను నిరాకరించారు.
దీంతో గతరాత్రి రవితేజను ఈ ముగ్గురు అడ్డుకొని చేరాలని ఒత్తిడి చేయడంతో వారి మధ్య మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో రవితేజను ముగ్గురు కలిసి కత్తితో మెడపై గొంతుపై పొడిచి హత్య చేశారని డిఎస్పీ తెలిపారు. కాగా మృతుని భార్య ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. కేసును ఆరు గంటల్లో చేదించడంలో కీలకపాత్ర పోషించిన టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు, వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, సిసిఎస్ సీఐ చంద్రశేఖర్, జైనథ్ సీఐ సాయినాథ్, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.