28-02-2025 02:27:23 PM
మణుగూరు (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని ఆఫ్ లోడింగ్ పనులు నిర్వహించే దుర్గా కంపెనీలో మెకానిక్ హెల్పర్ గా పనిచేసే ముని ప్రసాద్ బిస్కర్మ (32) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ చర్చి సమీపంలో శుక్రవారం మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న మణుగూరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు ప్రసాద్ ను బలమైన బండరాయితో కొట్టి హత్య చేసినట్లుగా పోలీస్ లు గుర్తించారు. మృతుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం సిద్ధి జిల్లా గోహరి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.