calender_icon.png 28 January, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి దారుణ హత్య

22-10-2024 11:19:52 AM

జగిత్యాల,(విజయక్రాంతి): పాత కక్షలతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే... జగిత్యాల మండలం తిమ్మాపూర్ గ్రామంలో బైక్ పై వెళుతున్న గంగరెడ్డిని  గుర్తు తెలియని దుండగులు కారుతో వెనుక నుంచి ఢీకొట్టారు. గంగారెడ్డి బైకు అదుపుతప్పి కిందపడగానే కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. తీవ్ర రక్తస్రావంలో ఉన్న గంగారెడ్డిని గుర్తించిన గ్రామస్తులు స్థానిక దవాఖానకు తరలిస్తుండా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ హత్య ఘటన ముగ్గురు ఉన్నట్లు గుర్తించిన, అందులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షలే హత్యకు కారణమని అనుమానిస్తూ హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిగా గుర్తించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,కాంగ్రెస్ కార్యకర్తలు హంతకుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించారు. హత్య వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు. సంతోష్ తో పాటు మరికొందరు హత్య సంఘటనలో పాల్గొన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.