సూర్యాపేట, జనవరి 1: కత్తితో పొడిచి వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో మంగళవారం రాత్రి జరిగింది. తండాకు చెందిన ధరావత్ శేషు(35) మంగళవారం రాత్రి తన సమీపబంధువు ఇంట్లో జరుగుతున్న పుట్టిన రోజు వేడుకకు బయలుదేరాడు.
తండా సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన తనకు వరుసకు సోదరుడైన దీపక్ తన మిత్రులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. అది గమనించిన శేషు తనతో పాటు తెచ్చుకున్న మద్యాన్ని వారితో కలిసి సేవించేందుకు వెళ్లాడు.
గతంలో దీపక్, శేషు కుటుంబాలకు భూతగాదాలు ఉండటంతో అదే అదునుగా దీపక్ తన బండిలో ఉన్న కత్తితో శేషును పొడిచి చంపేశాడు. పోలీస్‌లు తండాకు చేరుకుని అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు