calender_icon.png 1 April, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొల్లూరులో దారుణ హత్య

29-03-2025 08:26:59 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): పైపులతో కొట్టి ఒకరిని హత్య చేసిన ఘటన బాన్సువాడ మండలం కొల్లూరు శివారులో చోటుచేసుకుంది. సిఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం... బాన్సువాడ మండలం నాగారం గ్రామానికి చెందిన అమృతం విటల్ (35) శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులతో కలిసి కొల్లూరు శివారులోని పొలంలో మద్యం సేవించారు. అనంతరం ఇద్దరూ వ్యక్తులు పథకం ప్రకారం విట్టల్ ను వైపులతో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై తమ్ముడి భార్యనే హత్య చేయించిందని మృతుడి అన్న సాయిలు ఫిర్యాదు చేశారు. దీంతో మృతుడి భార్య, మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు సిఐ తెలిపారు.