calender_icon.png 24 February, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూపాలపల్లిలో దారుణ హత్య..

19-02-2025 08:43:59 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ సరళ భర్త నాగవెల్లి రాజ లింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో రాజలింగమూర్తి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.