calender_icon.png 26 December, 2024 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్టళ్లను పరిశీలించిన బీఆర్‌ఎస్‌వీ నాయకులు

01-12-2024 08:51:04 PM

సూర్యాపేట: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సూర్యాపేటలోని పలు ప్రభుత్వ హాస్టళ్లను పలువురు బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో పలు హాస్టళ్లలోని వసతులను గురించి విధ్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ పిలుపుతో రాష్ట్రంలోని గురుకులాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం విధ్యార్ధులకు పోషకాహారంను అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయగా నేడు రేవంత్‌రెడ్డి దానిని భ్రష్టు పట్టిస్తున్నాడన్నారు. గురుకుల విధ్యార్ధులకు నేడు రక్షణలేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని గురకుల విధ్యార్ధుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవన్నారు. ఈయన వెంట సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నాయకులు రాపోలు నవీన్, నెమ్మాది శ్రవణ్‌కుమార్, సురేష్‌నాయక్, సందీప్, పల్లెపంగ నాగరాజు తదితరులు ఉన్నారు.