01-12-2024 07:04:10 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో విద్య సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ ముస్తఫతో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. సందర్భంగా వంటశాల పరిసరాలతో పాటు భోజనం, కూర మెనూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
10 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా సంఘటనలు జరగలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థుల ఆరోగ్యలను గాలికి వదిలారని విమర్శించారు. విద్యార్థుల కు నాణ్యమైన భోజనంతోపాటు మంచి విద్యానందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో బీఆర్ఎస్ ముందుంటుందని స్పష్టం చేశారు. విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, నాయకులు సాయి శ్రావణ్, శ్రీకాంత్ ,తాజ్ ,అరుణ్ , ప్రవీణ్, రామ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.