calender_icon.png 30 October, 2024 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌వీ డ్రామాలు

30-10-2024 12:30:17 AM

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): చీకటి కోణాలు బయ టపడుతాయనే బీఆర్‌ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. డ్రగ్స్ పరీక్షలు చేయించు కుందామని సీఎం రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌కు ఎప్పుడో సవాల్ విసిరారని గుర్తుచేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ..

డ్రగ్స్ పరీక్షలు ఎక్కడా చేస్తారో కూడా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి తెలియదా? గ్యాస్ట్రో ఎంట్రాలజీకి డ్రగ్స్ పరీక్షకు ఏమైనా సంబంధం ఉం టుందా? అని ప్రశ్నించారు. కేటీఆర్ బామ్మర్ది రాజు పాకాల తప్పు చేయకపోతే.. మీ ఎమ్మెల్యేలు పోలీ సులను ఎందుకు అడ్డుకున్నారు? కోర్టుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే బయట తిరగనీయ మని హెచ్చరించారు.