calender_icon.png 18 March, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ ముట్టడికి బీఆర్‌ఎస్వీ యత్నం

18-03-2025 12:07:58 AM

  1. ఓయూలో ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్
  2. పలువురి అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): ఓయూలో ఆందోళనలు, ధర్నాలను నిషేధిస్తూ వర్సిటీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్  నాయకులు అసెంబ్లీ ముట్టడికి య  వారిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్, కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఉస్మానియా యూనివర్సిటీకి సర్క్యులర్‌తో సంకెళ్లు వేస్తారా అని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపా ధ్యక్షుడు తుంగబాలు ప్రశ్నించారు. సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని డిమాం  చేశారు. విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకుని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

ఓయూలో నిరసనలు

సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. లాకాలేజీ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సర్క్యులర్‌ను ఉపసంహరిం   ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ బంద్‌కు పిలుపునివ్వడంతో పలువురు ఏబీవీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.  అనంతరం ఏబీవీపీ నాయకులు తరగతులను బహి ష్కరించారు.