calender_icon.png 22 March, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ వి నాయకుల అరెస్టు

22-03-2025 09:26:04 AM

ఖానాపూర్, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండల బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను, శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా, నాయకులు మహిపాల్ సుద్దాల మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఏ చిన్న కార్యక్రమం చేపట్టిన ,రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, అబద్ధపు హామీలు ఇచ్చి, వీటి కోసం బడ్జెట్ సమావేశాల్లో ఎటువంటి కేటాయింపులు లేకపోవడం శోచనీయమని, కాగా తాము అసెంబ్లీ ముట్టడి చేస్తామనేమో ముందస్తుగా, అర్ధరాత్రి పూట తమ ఇళ్లపై దాడి చేసి, అరెస్టు చేసి ,నిర్బంధించడం చేతకానితనమని, అరెస్టులతో తమ పోరాటాలను ఆపలేరని, విద్యార్థి విభాగం నాయకులు అన్నారు.