08-02-2025 12:26:44 AM
బీసీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టి, బీసీలకు తీరని అన్యాయం చేసిందని ప్రజల మధ్యకు వెళ్లి వివరించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నది. దీనిలో భాగంగానే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ శంభీపూర్ నివాసంలో పార్టీకి చెందిన బీసీ నేలతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బీసీ జనాభాను భారీగా తగ్గించిందని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పనపై ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్‌తో పాటు ఏ హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలఅమలులో ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ గులాబీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.