22-03-2025 01:52:20 AM
ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): గత పదేళ్ల పాటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఆర్థిక విధ్వంసం సృష్టిస్తే.. కేంద్రంలో బీజేపీ తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపిందని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం బడ్జెట్‌పై మండలిలో మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలా మద్దతిచ్చిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాలతో తమ ప్రభుత్వం రూ. 3.04 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.