calender_icon.png 10 March, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

10-03-2025 01:28:12 AM

అధ్యక్షత వహించనున్న పార్టీ అధినేత కేసీఆర్

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావే శాల నేపథ్యంలో ఈనెల 11న మ ధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది.  ఈ స మావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు హాజరుకానున్నారు.

అ సెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధం గా వ్యవహరించాలి.. అధికార పార్టీని ఎలా ఇరుకున పెట్టాలనే విషయమై చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నిక లకు ముందు ఇచ్చిన హామీలు, గ్యా రెంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని భావిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ..ఈ సెషన్‌లో ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు స్వయంగా కేసీఆరే సభకు వస్తున్నానని ప్రకటించినందున బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉత్సాహంగా ఉన్నారు.