calender_icon.png 12 January, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌ది అశాంతి, హత్యల రాజ్యం

03-10-2024 12:52:48 AM

గాంధీ స్ఫూర్తితో నేడు శాంతియుత పరిస్థితులు 

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని, అక్టోబర్ 2 (విజయక్రాంతి)/మహాదేవపూర్: గత బీఆర్‌ఎస్ పాలకులు మంథని నియోజవర్గంలో తొమ్మిదేండ్లు అ శాంతి, హత్యలతో రాజ్యమేలారని, ఇప్పుడు మహాత్మాగాంధీ స్ఫూర్తితో శాంతియుత పరిస్థితులు నెలకొల్పుదామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో వైశ్య సంఘం ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం ఆవిష్కరించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్ల లో నియోజకవర్గంలో అశాంతి నెలకొల్పార ని, హత్యలు రాజ్యం చేశాయని, కాంగ్రెస్ పా ర్టీ కార్యకర్తలను, నాయకత్వాన్ని లేకుండా చే సే పయత్నాలు జరిగాయని విమర్శించారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యా ంగం, చట్ట ప్రకారంగా గాంధేయ మార్గంలో నడుస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తానని శ్రీధర్‌బాబు అన్నారు. కా టారం మండల కేంద్రానికి బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేయించానని, రూ. 4 కోట్లతో ఎకరం స్థలంలో ఐటీఐ కళాశాల నిర్మాణం జరుగుతుందన్నారు.

కాటారం మ ండల కేంద్రంలో పేదలకు చెందిన భూము లు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయి న విషయం సబ్‌కలెక్టర్ తన దృష్టికి తేగా వా టిని చట్టప్రకారంగా రాబట్టాలని కోరినట్లు మంత్రి తెలిపారు. కాటారం మండల కేంద్రం లో మహిళలకు పరిశ్రమలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి రూ.3 నుంచి రూ.5 కోట్లతో పరిశ్రమ ను స్థాపించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఐ దు మండలాలకు చెందిన వంద మంది మ హిళలను తన స్వంత ఖర్చులతో హైద్రాబాద్‌లో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. కలె క్టర్ వారి వివరాలు సేకరించి ఈ నెల 28వరకు ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశానికి మండల వైశ్య సంఘం అ ధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ అధ్యక్షత వ హించగా కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శ ర్మ, ట్రేడ్ అండ్ ప్రమోషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్‌రెడ్డి, ఎస్పీ కి రణ్ ఖరే, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అడిషనల్ కలెక్టర్ విజయల, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పవిత్రం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సమ్మయ్య, యువజన నాయకులు సందీప్, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షుడు కోట రాజబాబు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు వంశీవ ర్ధన్‌రావు పాల్గొన్నారు.

అంతకుముందు మ హాదేవపూర్ మండల కేంద్రంతోపాటు కొత్తపల్లి గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహి ళా శక్తి క్యాంటీన్‌లను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. కొత్తపల్లిలో సీనియర్ కాం గ్రెస్ నాయకుడు కుంభం రామిరెడ్డి, సీనియర్ పాత్రికేయుడు కొట్టె శ్రీశైలం మాతృ మూర్తి మరణించడంతో వీరి కుటుంబాలను పరామర్శించారు. 

అంగన్‌వాడీలకు అండగా ఉంటాం

మంథని(విజయక్రాంతి): గ్రామీణ ప్రాం తాల్లో సేవలందిస్తున్న అంగన్‌వాడీలకు అం డగా ఉంటామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నా రు. మంథని పట్టణంలో బుధవారం నిర్వహించిన పోషన్ అభియాన్ ముగింపు కార్య క్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అం గన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు త్వరలోనే జిల్లా లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నా రు.

వారికి పక్క భవనాలు కావాలని అడుగుతున్నారని, తప్పక ప్రయత్నం చేస్తామన్నారు. త్వ రలో అంగన్‌వాడీల్లో ఖాళీలను పూర్తి చే స్తామన్నారు. అనంతరం చిన్నారులకు మం త్రి అక్షరభాస్యసం చేశారు.

కార్యక్రమంలో క లెక్ట ర్ శ్రీహర్ష, మున్సిపల్ చైర్‌పర్సన్ రమా, ఆర్డీ వో హనుమనాయక్, తహసీల్దార్ రాజ య్య, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, కిసాన్ సె ల్ జిల్లా అధక్షుడు సురేందర్‌రెడ్డి, బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, మండలాధ్యక్షుడు ఐలి ప్రసాద్, దొడ్డ బాలాజీ పాల్గొన్నారు.