calender_icon.png 26 December, 2024 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటన సందర్భంగా బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు అరెస్ట్

04-12-2024 04:12:18 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా బెల్లంపల్లి బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సబ్బని అరుణ్ ని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరుణ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షనా ఉండే తమలాంటి ప్రజా నాయకులను ముందస్తు అరెస్టు ఆలోచన ధోరణిలో ప్రభుత్వం ఉందని, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తాము ప్రజల పక్షాన నిలబడి కోట్లాడుతామని అన్నారు.