01-04-2025 12:47:15 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందు నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న భారత రాష్ట్ర సమితి యువ నాయకులు గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, షేక్ చాంద్ పాషాలను మంగళవారం ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అది అనైతిక చర్య అని అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం వేలానికి పెట్టడం అనేది నీచమైన చర్య అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థుల పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన అణిచివేతను ఖండిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో జరుగుతున్న ప్రభుత్వ ధమనకాండకు నిరసనగా కేబీఆర్ పార్కు(KBR Park) వద్ద బీఆర్ఎస్వీ(BRSV) ఆధ్వర్యంలో జరుగుతున్న వినూత్న నిరసనకు దిగారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని తొలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలక్రమంలో అనేక పేరు ప్రఖ్యాతలు సాధించుకొని అక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఉండని అటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ని వేలకానికి పెట్టడం ప్రభుత్వం అనైతిక చర్య అని మండిపడ్డారు. ఏది ఏమైనా అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.